Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

10 మినిట్ డెలివరీలు లేవు.. అయినా ఇక్కడే ఆనందం: థాయ్‌లాండ్‌లో భారత జంట అనుభవాలు

No 10 minute deliveries but happiness here Experiences of Indian couple in Thailand
Advertisement
  • భారత్‌లోని పట్టణ జీవనంతో పోలిస్తే థాయ్‌లాండ్‌లో జీవితం మెరుగ్గా ఉందన్న జంట
  • అక్కడ ఒత్తిడి తక్కువ, వ్యక్తిగత భద్రత ఎక్కువ అని వెల్లడి
  • రాత్రిపూట మహిళలు ఒంటరిగా నడిచినా భయం లేదని అనుభవం పంచుకున్న శ్రేయ
  • ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గి వ్యక్తిగత సమయం పెరిగిందన్న జంట
Advertisement
భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ఉరుకుల పరుగుల జీవితం కంటే థాయ్‌లాండ్‌లోని ప్రశాంత జీవనమే మేలని ఓ భారతీయ జంట చెబుతోంది. తాము థాయ్‌లాండ్‌కు ఎందుకు మకాం మార్చాల్సి వచ్చిందో వివరిస్తూ వారు పంచుకున్న అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రేయ, అమిత్ అనే ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (@shreya.x.amit) ఈ విషయాలను పంచుకున్నారు.

భారత్‌లోని టైర్-1 నగరాలతో పోలిస్తే ఇక్కడ అద్దె దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, జీవనశైలిలో మాత్రం చాలా తేడా ఉందని వారు పేర్కొన్నారు. "ఇక్కడ 10 నిమిషాల డెలివరీలు ఉండవు. కానీ, ప్రతి కొన్ని వందల మీటర్లకు ఒక 7-ఎలెవెన్ స్టోర్ ఉండటంతో ఆ అవసరం కూడా రాదు" అని వారు తమ పోస్ట్‌లో రాశారు.

థాయ్‌లాండ్‌లో ప్రజల ప్రవర్తన, వ్యక్తిగత భద్రత గురించి శ్రేయ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడి ప్రజలు చాలా దయగా ఉంటారని, అపరిచితులు కూడా చిరునవ్వుతో పలకరిస్తారని, వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం ఇస్తారని తెలిపారు. "ఒక మహిళగా రాత్రిపూట ఒంటరిగా నడిచి వెళ్లినా భయపడాల్సిన అవసరం లేదు" అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.

పట్టణాల్లో మాదిరిగా ట్రాఫిక్‌లో గంటల తరబడి సమయం వృథా కాకపోవడంతో తమకు వ్యక్తిగత సమయం పెరిగిందని వారు వివరించారు. "జీవితం ట్రాఫిక్‌లో కరిగిపోతున్న భావన లేదు. నడవడానికి, కేఫ్‌లలో పనిచేసుకోవడానికి, ఒకరితో ఒకరం గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతోంది" అని వారు తెలిపారు.

ఈ జంట పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న పలువురు ప్రవాసులు, పర్యాటకులు సైతం వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, తమకు భారతదేశమే సొంత ఇల్లు అని, కానీ థాయ్‌లాండ్‌లో దైనందిన జీవితం భిన్నమైన అనుభూతిని ఇస్తోందని వారు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
Shreya and Amit
Thailand lifestyle
Indian couple in Thailand
Moving to Thailand from India
Thailand safety for women
India vs Thailand living

More Telugu News